👌వరుణుడు జలాధిపతి
వల్లె త్రాడు దాలుపు
పశ్చిమ దిశకు ప్రభువు
ఓ తెలుగు బాల!
* * * *
👌"వరుణుడు" అనగా,.. లోకులకు వరముల నొసంగు వాడు. శత్రువులను పాశముల చేత బంధించు వాడు.. వరుణుడు.
👌 మకర వాహనుడు.. వరుణుడు. మొసలిని వాహనము గా కలవాడు. కనుక, "మొసలి గుర్రము రౌతు" అని పేరు.
* * * * *
(వరుణుడు..
పశ్చిమ దిక్పాలకుడు! పడమర దిశ నేలు వాడు, "పడమటి దొర"! అపాం పతి.. జలమునకు అధిపతి, "నీళ్ళ రాయుడు"! మేఘములకు రాజు.."మెయిలు రేడు"!.. అని, అచ్చ తెలుగు పదాలు. )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి