*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౫౫ - 55)

 మత్తేభము:
*సులభుల్ మూర్ఖుల నుత్త మోత్తములు రా | జుల్గల్గియే వేళ న*
*న్నలతంబెట్టిన నీ పదాబ్జముఁబా | యంజాల నేమిచ్చి నం*
*గల ధౌతాచల మేలుటంబునిధిలో | గాపుండుటబ్జంబుపై*
*చెలువొప్పన్సుఖియింపగాంచుట సుమీ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
మూర్ఖులైన తేలిక మనస్తత్వం కలిగిన కొంత మంది రాజులు నన్ను ఎన్ని రకాలుగా బాధలు పెట్టే ప్రయత్నం చేసినా, నీ మంచుకొండ లో నివాసం, పాల సముద్రం లో కాపురం వుండటము,  తామరపువ్వు పై హాయిగా సుఖంగా వుండటం మొదలైన ఆశలు ఎన్ని చూపించినా నీ పాదాలు తప్ప ఇంక వేరేవీ అవసరం లేదు.......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీ పాద సన్నిధి, శివ పదము, విష్ణు పదము, బ్రహ్మ పదము కంటే ఎన్నో రెట్లు మిన్న అయినది.  అంత ప్రముఖమైన, శిరులు ఇచ్చే నీ పాదములు విడుచుట వలన ఎంతటి సంపదలు లభించినా, ఏ మందమతీ తీసుకొనడు కదా! నీ పాదపద్మముల సన్నిధి కంటే ఏదీ ఎక్కువా కాదు, విలువైనదీ కాదు. ఈ భూమండలం, ఆ స్వర్గ సీమ నాకు రాసిచ్చినా నీ చరణారవిందాలు వదలనుకాక వదలను.  నీ చరణసీమను మించిన సౌఖ్యం వేరెక్కడ దొరకదు. ఇది నిక్కం.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss