: బాల్యం వెలకట్టలేని మూల్యం :- విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్ -9985117789
సాహితీకవికళా పీఠం 
===============
తల్లి కొంగు వెనుక నక్కిన దొంగగా,
నాన్న భుజములెక్కి ఆటలాడి,
అన్న అక్కలకు దొరకని పరుగులు,
చిన్న నాటి తీపి గురుతులవి-

'మా నాన్నాలు లేడని చెప్పమన్నాడనటం',
'నాన్నాలూ చిగ్గులేనోడొచ్చేసాడనటం',
'తాతగాలూ కత పెట్టండనడం',
చిన్ననాటి మాటల మధుర స్మృతులు-

సైకిల్ తొక్కుతూ కింద పడటాలు, 
కోతికొమ్మచ్చిలాటలో మిత్రులతో తూచ్లు,
తెల్లరేసరికి అదే మిత్రులతో చెట్టపట్టాలు,
లెక్కలు రాక మాస్టారు జుళిపించిన బెత్తాలు,
తలిచినప్పుడు మైమరిపించే స్మృతులు

అమ్మకు మాయ మాటలు చెప్పి,
నాన్నను వినయంతో నమ్మించి, 
స్కూలుకి డు

మ్మా కొట్టి,
టూరింగ్ టాకీస్ కు సినిమాకెళ్లడం - 
మరిచిపోలేని ఆనాటి మధురస్మృతులు -

ఎంతైనా బాల్యము అమూల్యము, 
అల్లరి పనులకు ఆనుకూల్యము,
ఎవరూ చూపెట్టని ప్రాతికూల్యము,
స్మృతులకు వెలకట్టలేని మూల్యము

•••••••••••••
కామెంట్‌లు