ఏమాయె రా. నాకు కరోనా టీకా వేయించరా. అని నానమ్మ అనేసరికి-
నీకెందుకే ముసలి. రేపో మాపో గుటుక్కు మనే తట్లు ఉన్నావ్.అన్నాడు మనవడు.
నాకు వయసు 90. ఆ మాట కాదనను. కానీ, నేను టీకా అడుగుతున్నది నా కొరకు కాదు రా.
నీకు టీ కా వేయించ మంటావ్. మళ్లీ నా కొరకు కాదు అంటావు. వయసుతో పాటు మతి పోతుందా ఏందే నానమ్మ.
ఓరి! పిచ్చి వెధవ! నాకు టీకా వేయించడం వలన, నాకుకరోనా రాదు కదా!
అవును అన్నాడు మనవడు. అప్పుడు నేను క్షేమంగా ఉంటే... మీరు క్షేమం కాదా అన్నది నానమ్మ.
చూసినావు రా మా అమ్మ. తన చివరి క్షణాలలో కూడా మన క్షేమమే కాంక్షిస్తుంది. ఆమెనేరా అమ్మ. అని నాన్న అనగానే మనవడు తల దించుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి