తాతయ్య కథలు-64..:- ఎన్నవెళ్లి రాజమౌళి

 నిద్ర పడతలేదారా.. అటు ఇటు మసలుతూ ఉన్నావు. అని తాతయ్య అనగానే-
ఈ దుప్పటి చాలు త లేదు తాతయ్య. కాళ్లకు నిండుగా కప్పి తే... తల దిక్కు అందుతలేదు. తలను నిండుగా కప్పి తే కాళ్లకు అందుతలేదు 
అన్న మనవడి మాటలకు తాతయ్య నవ్వి-మన పొడవు దుప్పటి ఉంటే మంచిదే... కాదనను. కానీ, దుప్పటి చిన్నగా ఉన్నా.. ఆ దుప్పటిలో ముడుచుకోవాలి.
ఎలా తాతయ్య అన్న మనవడితో.. సంసారానికి కూడా ఈ మాట అక్కరకు వస్తుంది రా. అన్ని వసతులతో ఉండాలంటే... సాధ్యం కాకపోవచ్చు. ఉన్నదానిలో సర్దుకోవాలి. అందుకే ఒక సామెత ఉంది. అన్న తాతయ్య తో-
ఏమి సామెత తాతయ్య అని అడుగగా-
దుప్పటి ఎంత ఉంటే అంతలోనే ముడుచుకోవాలి. ఒక్కొక్కసారి మన పొడవు దుప్పటి దొరకక పోవచ్చు. బాగా చెప్పావు తాతయ్య అని, ముడుచుకొని పడుకున్నాడు మనవడు.

కామెంట్‌లు