నాన్న! ఏనుగులు ఇంటి ముందు నుండి వెళ్తున్నాయి. అమ్ముతారట. ఒక ఏనుగుకు వెయ్యి రూపాయలేనట. అని, కొడుకు అనడంతో-
మనకెందుకురా! ఏనుగు లు అక్కరలేదు అన్నాడు నాన్న.
20 సంవత్సరాల తర్వాత... మనవడు వచ్చి తాతయ్య! ఏనుగులను కొందామా అని అడుగగా...
ఎంతకు 1 ఆటరా అని, మనవడితో అనగా-
ఏబది వేలకు ఒకటట. అవి ఎన్ని ఉన్నాయని మళ్లీ తాతయ్యఅడగగా-
రెండు ఏనుగులు ఉన్నవి తాతయ్య అన్నాడు మనవడు.
ఆ ఏనుగులను మన పెరటిలో కట్టేయమను-నేను డబ్బులు ఇస్తా తీసుకెళ్లి ఇవ్వు . అన్నాడు మనవడి తో-
ఇదంతా చూస్తూ ఉన్న కొడుకు... నేను అడిగినప్పుడు వద్దని అన్నావు. ఇవ్వాళ మనవడు అడగగా పెరటిలో కట్టెయ్యమని అన్నావు. ఏంది నాన్న ఇది అనగా-
ఆనాడు మనకు డబ్బు లేదు. బాకీ చేద్దామా! అందుకే వద్దన్నాను. ఈనాడు డబ్బు ఉంది. ఏనుగులను కొన్నాను అన్నాడు నాన్న.
తాతయ్య కథలు-66..:- ఎన్నవెళ్లి రాజమౌళి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి