శాస్త్రపరిజ్ఞానంతో ప్రపంచాన్ని
హస్తగతం చేశానని విర్రవీగే
మానవుని అపర మేధస్సు ముందు
కరోనా రక్కసి వికట్టహాసం చేస్తూ
నిషాచరంలోకి నెట్టి ఊపిరి లాగేసింది
ప్రకృతి ఒడిలో పాఠశాల గుడిలో
నిరాటంకంగా సాగిపోతున్న చదువులకు
కరోనా మాయరోగం కాటువేసెను
సీతాకోకచిలుకల్లాంటి పిల్లలకు
ఆటపాటల చదువులు దూరం చేసెను
విశ్వచేతనంగా వెలిగిన విద్యావ్యవస్థ
గురుశిష్యుల సంబంధం సన్నగిల్లి
గురుకుల ప్రాంగణాలు మాయమయ్యి
పెక్కుఅవస్థలు పడుతోంది
ఇరుకు గవాక్షాలలో ఇరుక్కుని
వేదన చెందుతోంది
ఆన్లైన్ పాఠాలకై అప్పులు
కన్నబిడ్డల భవితకు కష్టాలు
చరవాణి చదువుల తికమకలు
మతికెక్కక పిల్లల అవస్థలు
చెడు త్రోవన చరవాణికి బానిసలు
అమ్మానాన్నలను బురుడీ కొట్టిస్తూ
చరవాణిలో ఆటలు చాటింగులు
రంగుల వీడియోలలో కాలక్షేపాలు
సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు బలి
సమయానికి కరెంటులేక సిగ్నలు రాక
బుర్రలో అజ్ఞానం అయోమయం
విసిగెత్తిన చదువుల సంగతి
పల్లెపిల్లల బొంగరాల ఆటలు
గుంపులుగా బూతుల బాతకానీలు
పూటగడవని బతుకులు కూలిపనులకు
వ్యవసాయ పనులలో పెద్దలకు ఆసరా
చదువకపోయినా తరగతి పెరిగి
రాయకపోయినా మార్కులు వచ్చి
విలువలులేని జ్ఞానంలేని చదువు వ్యర్టం
గణగణ మోగే బడిగంట పిలుపుకోసం
గురువుల సన్నిధిలో చదువుకై ఆరాటం
ప్రకృతికి పసిపిల్లల ఆత్మేయ వేడుకోలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి