రాజాం పట్టణానికి చెందిన యుటిఎఫ్ సీనియర్ నేత, జనవిజ్ఞాన వేదిక సీనియర్ నేత పెంకి గౌరీశ్వరరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నేతలు సంతాపం తెలిపి, నివాళులర్పించారు. యుటిఎఫ్, జె.వి.వి. రాష్ట్ర నాయకులు బొడ్డేపల్లి మోహనరావు, గొంటి గిరిధర్, రెడ్డి మోహనరావు, జిల్లా నాయకులు గిరడ చంద్రశేఖర్ నాయుడు తదితరులు గౌరీశ్వరరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరీశ్వరరావు సతీమణి చిన్నమ్మలు, కుమారులు చైతన్య కుమార్, జ్యోతిబసు, సోదరుడు వెంకటరావులను, రాజాంలో వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. విద్య, సాహిత్య, కళా, సామాజిక రంగాల్లో గౌరీశ్వరరావు చేసిన సేవలను ఈ సందర్భంగా వీరు ప్రస్తుతించారు.
గౌరీశ్వరరావు మృతి పట్ల యుటిఎఫ్, జనవిజ్ఞానవేదిక నేతల సంతాపం
• T. VEDANTA SURY
రాజాం పట్టణానికి చెందిన యుటిఎఫ్ సీనియర్ నేత, జనవిజ్ఞాన వేదిక సీనియర్ నేత పెంకి గౌరీశ్వరరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నేతలు సంతాపం తెలిపి, నివాళులర్పించారు. యుటిఎఫ్, జె.వి.వి. రాష్ట్ర నాయకులు బొడ్డేపల్లి మోహనరావు, గొంటి గిరిధర్, రెడ్డి మోహనరావు, జిల్లా నాయకులు గిరడ చంద్రశేఖర్ నాయుడు తదితరులు గౌరీశ్వరరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరీశ్వరరావు సతీమణి చిన్నమ్మలు, కుమారులు చైతన్య కుమార్, జ్యోతిబసు, సోదరుడు వెంకటరావులను, రాజాంలో వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. విద్య, సాహిత్య, కళా, సామాజిక రంగాల్లో గౌరీశ్వరరావు చేసిన సేవలను ఈ సందర్భంగా వీరు ప్రస్తుతించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి