ప్రకృతి మది ...!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం


ప్రకృతిలో పుట్టి ప్రకృతిని అంతా
పరిచయం చేసుకోకుండానే 
ప్రపంచ నుంచి నిష్క్రమించింది 
గత ప్రపంచం........!!?

ఇప్పుడు 
ప్రపంచం సృష్టించిన కొత్త ప్రపంచాన్ని 
పరిచయం చేసుకోకుండానే 
ప్రపంచం పరిగెడుతుంది........!!?

దేవుడు కూడా దాక్కునే దర్శనమిస్తాడు. 
సూర్యుడు కూడా దాక్కునే ఉదయిస్తాడు 
విత్తనం కూడా దాక్కునే మొలకెత్తుతుంది 
సింగం కూడా దాక్కునే దాడి చేస్తుంది....!!

ఎదురుగా నిలబడి కలబడేది పర్వతం 
ఎదురుగా నిలబడి కనబడేది అడవి 
ఎదురుగా నిలబడి ముంచేది సముద్రం..!!

ఎదురుగా నిలబడి పారేది నది!
 దాక్కొని ఉండి కరిగేది మది.....!!
======================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్
 నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు