ఏం బేరం చేస్తావురా.. ఎప్పటికీ బాకీల అంటూ ఉంటావు. అన్న నాన్నతో... నేను ఏమి చేయాలి. రేయింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నానుగా నాన్న.
కష్టపడుతున్నావ్ కాదనను. నువ్వు ఏం బేరం చేసినా, ఏ పని చేసిన అందులో లాభం చూసుకోవాలనా, వద్దా.
లాభం వస్తలేదు నాన్న. ఎప్పుడు బేరం చేసినా... మొదలు కే మోసం తేవడితివి. నీకు లాభం ఎప్పుడూ కనబడుతుంది రా. అందుకే మన పెద్దలు తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నారు.
అంటే ఏమిటి తాతయ్య. ఏబేరం చేసినా మూలధనం కొంత ఉంచుకోవాలి. ఏ కారణంగానైనా బేరం లో దెబ్బతిన్నప్పుడు... ఆ మూలధనంతో మళ్లీ బేరం చేసుకోవాలి అన్నమాట.
నాన్నను ఇప్పుడు ఏమి చేయమంటావు తాతయ్య.
కొంత డబ్బు దగ్గర పెట్టుకుని, మిగతా డబ్బుతో బేరం చేయాలి. డబ్బు జమ అయ్యేవరకు ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఎలాగా తాతయ్య. డబ్బు జమ కాకముందే... మళ్లీ ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇలా అయితే డబ్బు ఎలా జమవుతుంది రా. బాగా చెప్పావు తాతయ్య అన్నాడు మనవడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి