తాతయ్య కథలు-77.ఎన్నవెళ్లి రాజమౌళి

 తాతయ్య! అని మనవడు ..అనగానే... ఏమి సంగతి రా అన్నాడు తాతయ్య.
మొలక వాట్సాప్ లో నువ్వు  పెడుతున్న కథలు అన్ని నేను అభినయం చేయగా.. మా అమ్మ సెల్లులో రికార్డ్ చేసి, యూట్యూబ్ లో  పెడుతున్నది తెలుసా...
మంచిదే కదా. నువ్వు నటుడి వి అయితావేమో.. అని తాతయ్య అనగానే-
మీరే కథలు చెబుతారా... మా మనవడు చెప్పాడా ఏంది? అన్నది నానమ్మ.
నేను వద్దన్నానా... మా తాతయ్య కూడా హరి కథలు చెప్పే వాడట. ఆ లక్షణమే నాకు వచ్చిందని మా అన్నయ్య అంటుంటాడు.
నేను కథ లు రాశాను , కథలు చెప్పాను. అని తాతయ్య అనగా...
మీలాగా మీ మనవడు కథలు రాప్తాడు ఏమో.... కథలు రాయడమే కాక, వాడు మంచి స్టోరీ టెల్లరు అవుతాడు అన్నాడు తాతయ్య.
మీకు పోటీగా మీ మనవడు తయారవుతున్నాడు. అన్నది నానమ్మ. అంతకంటే ఇంకేం కావాలి నాకు.. వాడు రాసిన కథలు పత్రికలో వచ్చేవరకు జీవించాలని నా ఆశ అన్నాడు తాతయ్య.