తాతయ్య కథలు-80..ఎన్నవెళ్లి రాజమౌళి .

 ఈరోజు గురుపూర్ణిమ కదరా. మీ గురువులకు ఎవరికైనా పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకోవా? అన్నది అమ్మ.
బాగా చెప్పావు అమ్మ. ఇప్పుడే ఆ పని చేస్తా చూడు అంటూ... పిలుస్తున్న వినకుండా బయటకు వెళ్లాడు కొడుకు.
ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు అబ్బా.. భోజనం కూడా చేయలేదు. అన్న శాంతమ్మ తో..
వాడికి లేని ఆలోచన పెట్టి నావు. ఏ గురువు దగ్గరకు వెళ్లిండో ఏమో అన్నాడు భర్త నేనే మి అన్న య్య. ఏదో పేపర్ లో చూసి అన్నా కానీ, వాడికి ఇప్పుడు గురువు దగ్గరకు వెళ్లమన్న నా అన్నది శాంతమ్మ.
వీళ్ళు మాట్లాడుకుంటుండగా నే కొడుకు వచ్చాడు. ఎక్కడికి వెళ్లావు రా. అన్నా వినకుండా తాంబాలం తెచ్చి అమ్మ, నాన్నల కాళ్లు కడిగాడు. మిఠాయి ముందుగా అమ్మకు తినిపించి, తరువాత నాన్నకు తినిపించాడు.
ఇది ఏందిరా. నేను గురువులకు పూజ చేయమంటే నాకు, నాన్నకు పూజ చేశావు అన్నది అమ్మ. తొలి గురువు అమ్మ నే కదా. అందుకే  నీకు, నాన్నకు పూజ చేశాను అని అనగా... తల్లిదండ్రుల కళ్ల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. కొడుకును ఇద్దరూ ఆశీర్వదించారు.

కామెంట్‌లు