పల్లవి:-
ఎన్నెలమ్మ ఎట్టుపోతివే... నువ్వేలేక ...
లోకమంత సీకటాయనే
ఎన్నెలమ్మ యెట్టపోతివే..నువ్వేలేక
నేను ఒంటిగుండలేనులే ...""2""
పోతేపోని ఏమైనా కానీ లోకం
నువ్వు నేను ఒక్కటౌదాం
అయితేకానీ ఏమైనా..నువ్వు నేను మరనిద్దాం..
అనుకున్నా ఎన్నో నేను కలగన్నా ఎంతో నేను 2
నువ్వేలేక నేడు నేను చిన్నబోతున్నా.....
ఎన్నెలమ్మా.....ఎన్నెలమ్మా.....2 "పల్లవి""
చరణం :- 1
ఏ కారుమబ్బు నిన్ను కమ్మివేసెనో...
ఏ కలనాగు నిన్ను కాటువేసెనో...
కంటతడి అరకున్నది...
కలతబడి మనస్సు చెదురుతున్నది..2
నువ్వేలేక అడుగు కదలకున్నది..
ఎన్నెలమ్మా...ఎన్నెలమ్మా.....2
దిక్కు దిక్కులన్నీ తిరిగివచ్చినా..
రాతిదేవుళ్లకన్నీ ..మొక్కివచ్చినా..నీ జాడే లేదమ్మా..
నూ చెంతలేని క్షణమూ అవుతున్నది ఒకయుగము
ఎట్టాచేతునే...ఏమి చేతునే...""పల్లవి""
చరణం :- 2
చెప్పుకున్న ఊసులన్నీ... మిగిలిపోయెనే..
కంటినిండా నీ రూపమే నిలిచిపోయేనే..
నిన్నా మొన్నా జ్ఞాపకాలు తట్టి తట్టి తడుముతున్నవే..
నువ్వేలేని క్షణము నేనెట్టా ఓర్చుకొందును
గుండెనిండా ఈ బాధనెట్టా దాచుకొందును ..
ఎన్నెలమ్మా... ఎన్నెలమ్మా.....2
కూడోగంజో దిందాము
చెట్టు నీడనైనా చల్లగుందాము అని
అనుకున్నా ఎంతో నేను
కలగన్నా ఎంతో నేను ..
ఎన్నెలమ్మా..ఎన్నెలమ్మా...2 ""పల్లవి""
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి