నన్ను దోచుకుందువటే
అనే పాటతో
చిత్ర సీమలో ప్రవేశించి
తెలుగు వారి గుండెల్లో
వెలుగై నిలిచిన సినారె పుట్టినరోజు.....
అనుబంధం ఆత్మీయత
అంతా ఒక బూటకం అని
ఒక నాటకమని..,...
జాలి గుండె లేని మనిషి కన్నా
కుక్క మేలు రా అన్నాడు
ఈ నల్లని రాళ్ళలో
ఏ గుండెలు దాగినవో
తెలుసుకున్న మర్మయోగి
ఇదేనా మన సంప్రదాయం
ఇదేనా.... అంటూ
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము కాపాడ
రావా అని దైవాన్ని ప్రార్ధించిన
ఆడవే జలకమ్ములాడవే అని
రాయల తెలుగు వైభవాన్ని
కీర్తించిన సినారె పుట్టిన రోజు
పాటై ప్రవహించిన రోజు
లక్షలాది గుండెల్లో
నిరంతరం ప్రవహించే పాట.
ఆయన ప్రసంగం వింటే చాలు
పరవశించి పోతారు
ఆధునిక తెలుగు కవిత్వం
సంప్రదాయాలు, ప్రయోగాలలో
ఆధునిక కవిత పోకడలను
గొప్పదనం పరిచయం చేసిన
సమకాలీన సమాజాన్ని
మూడు తరాలను ప్రభావితం చేసిన
మనిషిని మట్టిని ప్రేమించిన మహాకవి
బోధకుడు, ప్రకృతి ఆరాధకుడు
విశ్వ సాహిత్యంలోకి విస్తరించినవాడు
విశ్వంభర కావ్యం సృష్టికర్త
ఆచార్యుడు డాక్టర్ సినారె
మరణము లేని మహాకవి
తెలంగాణలో హనుమాజీపేటలో
జలపాతమై ప్రభవించి
విశ్వాంతరాళాలలో ప్రవహించిన
విఖ్యాత కవి డా సి నా రె
పాట,గేయం, పద్యం, గజల్,
వ్యాసం,వచనకవిత్వం,
పరిశోధన,విశ్లేషణ,పలు ప్రక్రియల్లో
విస్తరించిన వాడు మా సినారె....
తొంభై కావ్యాలకు
ఆయుష్షు పోసిన కవి
సినారె పుట్టిన రోజు....
సాహితీ క్షేత్రంలో ఆయన పాట
నిత్య వసంతమై
పరిమళిస్తునే ఉంటుంది....

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి