ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య... ఒక పాఠం: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
 

రూపారెడ్డి ప్రిన్సిపల్ హత్య ఉదoతం యావత్ ఉపాధ్యాయ లోకాన్ని కలిచివేసింది. అందరిని 
 భయభ్రాంతులకు గురిచేసింది.
చదువు నేర్పిన  ఖర్మానికి ఒక ఉపాధ్యాయుని బలయింది. 
మందలించిన పాపానికి ప్రిన్సిపల్ కు ప్రాయశ్చిత్తం జరిగింది. పిల్లల్ని ఒక గాడిలో పెట్టాలని అనుకున్నా ఆవిడ అమ్మలాంటి ఆలోచన  ప్రాణాన్ని తీసుకొని పోయేట్లు చేసింది. ఆమె ఫోన్లో చివరి పిలుపు బాబు అనడం పిల్లల పట్ల ఆమెకున్న ప్రేమకు ఒక నిదర్శనం.  ఈ దారుణమైన హత్యకు ఒడిగట్టిన వారు పాఠశాల వయసులోని పిల్లలు (school age) అన్నప్పుడు మరింత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం ఎటువైపు వెళుతుంది. గురుబ్రహ్మ అని పూజించే ఈ దేశంలో ఇది ఎందుకు జరిగింది? తల్లిదండ్రులు విద్యావేత్తలు మనో వైజ్ఞానిక నిపుణులు అందరూ కలిసి ఆలోచించాల్సిన సమయం ఇది. రేపటి యువ సమాజాన్ని నేర ప్రవృత్తి నుండి కాపాడే ప్రయత్నం చేద్దాం.
ఈ జెన్ జి తరంలో పిల్లలకు మొబైల్ ఇంటర్నెట్ అన్ని అందుబాటులోకి వచ్చాయి.
వాటిని విపరీతంగా వాడటం మూలాన సమాజం తలదించుకునే చర్యలు  అక్కడక్కడ జరుగుతున్నాయి. 
అయితే అది ఇప్పుడు హత్యగా మారడం అందరినీ కలచి వేస్తున్నది. ఈ హత్యా నేరానికి పాల్పడిన వారు 13 నుండి 15 సంవత్సరాల ప్రారంభ టీనేజీలో ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వయసు. మెదడులో తుఫాను వస్తుంది. ఈ వయసులోని పిల్లల్లో 100% మెదడు యాక్టివ్ గా ఉండి కోపము రిస్క్ చేయాలనే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. 50 శాతం మంది దీని పరిణామం ఏంటి అని వెనక ముందు ఆలోచించరు. 200% ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అనేది ఉంటుంది. ఆరు సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు మట్టి లాంటి వయసు. దానికి ఆకారాన్ని ఇవ్వాలి.
 ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరికీ సమయం లేదు. వారు ఉద్యోగస్తులు లేదా వర్కింగ్ పేరెంట్స్ అయినాక ఇబ్బందులు మొదలయ్యాయి. ఏ పిల్లవాడు చెడ్డవాడు కాదు మెదడు మరియు పరిసరాలు అలా చేస్తాయి. బంధురా(bandura )
మనస్తత్వ శాస్త్రవేత్త 
చెప్పినట్లు చూసింది చేస్తా (సామాజిక అభ్యాసం social learning) అన్నారు. అది ఇప్పుడు అలాగే జరిగింది.
 మొబైల్లో, యూట్యూబ్లో ఇన్స్టాల్ వాళ్లు ఏదైతే చూశారో అదే చేశారు. తక్షణ సుఖం కావాలి పరిణామాల గురించి ఆలోచించరు.
 గొట్టే ఫ్రెడ్సన్ అని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పినట్లు స్వీయ నియంత్రణ (self control) వీరిలో తక్కువగా ఉంటుంది. ముందు పిల్లలు చిన్న చిన్న దురాలవాట్లకు దగ్గరఅయినారు. తరువాత జల్సాలు, పార్టీల వరకు చేరింది. మొబైల్స్ వీటికి  ఆజ్యం పోస్తున్నాయి. 
సరిగ్గా అప్పుడే రూపా రెడ్డి ప్రిన్సిపల్ గారు కౌన్సిలర్ పాత్రను ధరించి
పిల్లల్ని మందలించారు. తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. 
 స్వీయ నియంత్రణ తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు స్కూలు మానేయడం, రీల్స్ గేమ్స్ రిస్క్ చేస్తారు. అవి వారి మెదడుకు మజాను ఇస్తాయి అందుకే వాటి వైపుకు వైపుకు అడుగులు వేశారు. డోపమైన్ కోసం వెంపర్లాడారు. 
ఇదే వారిని హత్య వైపుకు పురికొల్పింది. ఇది మామూలు హత్య కాదు 27 సార్లు ఆమెను  పొడవడం చూస్తే ఎంత కక్ష పెంచుకున్నారో వాళ్ళు అనేది మనకు అర్థం అవుతుంది. మాస్కులు వాడటం, సీసీ కెమెరాలు నుండి తప్పించుకునే విధానాలు 
వాళ్ళు యూట్యూబ్ల ద్వారా ఇంత బాగా తెలుసుకున్నారు 
ఇక్కడ తెలుస్తుంది. చెడును త్వరగా గ్రహించే వయసు ఇది.
 విద్యార్థుల abnormality ట గురించి గ ఉపాధ్యాయులు  ఏం అనుకుంటున్నారో...సరిగ్గా అదే...పురాణాలు కూడా నేర ప్రవర్తన గురించి హెచ్చరించాయి. సంస్కరించుకోవడానికి దారి చూపాయి.
 కుసంస్కారం (ఇంట్లో కొట్లాటలు గొడవలు) 
కుసాంగత్యం... మంచి స్నేహితు లేకపోవడం కారణం.
అహంకారం... నేను గొప్ప అనే భావన. ఇది బాల నేర ప్రవృత్తికి దారితీస్తాయి. రూపా రెడ్డి హత్య ఉదoతంలో పిల్లలు ఆమెను గురించి పూర్తిగా అధ్యయనం చేశారు. డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఎలా చంపాలి? రెక్కీ నిర్వహించడం వారికి టెక్నాలజీ పట్ల ఎంత అవగాహన ఉంది అని తెలుస్తుంది. రూపారెడ్డి దగ్గర హత్యానంతరం డబ్బులు ఎత్తుకొని వెళ్లి జల్సాగా ఖర్చు చేశారు. పోలీసులు పట్టుకున్నప్పుడు వాటిపై రక్తం మరకలను చూసి హత్య చేసినట్లు గుర్తుపట్టినారు పట్టినారు. అంటే పిల్లల మానసిక పరిస్థితి  ఎలా ఉందో అంచనా వేయవచ్చు.
మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చినాక మాత్రమే మనసు స్వాధీనం తప్పిపోయింది తాత్కాలిక ఆనందం సుఖం కోసం వాళ్ళు  (ప్రేయస్ మార్గం 
కఠోపనిషత్) లో చెప్పినట్లు అనుసరించి జీవితాలని చీకటిలో పడేటట్టు చేసుకున్నారు.
తల్లిదండ్రులారా జాగ్రత్త
సంపాదనలో పడి, పిల్లల పెంపకం మరవకండి. మాతృదేవోభవ అని ఉపనిషత్ చెప్పినట్లు నేర ప్రవృత్తి రాకుండా ఉండాలంటే ఇంట్లో ప్రేమను అందించండి. సమయం ఇచ్చి పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయండి. పిల్లలకు ఇవ్వాల్సింది డబ్బు కాదు, సంస్కారం అని గుర్తించండి. మొబైల్ నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటుంది. ఉగ్గు పాలతోనే మొబైల్ అలవాటు చేసే తల్లి ఏదో ఒక రోజు ఈ ముప్పు మన ఇంటి దాకా వస్తుందని సత్యాన్ని గ్రహించాలి. పిల్లలకు శిక్షలు వేయడం కన్నా, ప్రేమతో విపరీయ చర్యల దారి  మళ్ళించండి. అబద్దాలు చెప్పిన తొలిరోజే సరి చేయండి. ఎలాంటి స్నేహితులు మీ పిల్లలకు ఉన్నారో గమనించండి. తల్లిదండ్రులు కూడా టీచర్లతో గొడవ పడకండి.
ప్రతి చిన్న దానికి పెద్ద దానికి టీచర్ను బాధ్యుల్ని చేయకండి. పిల్లల ముందర టీచర్లను చులకనగా మాట్లాడద్దు. చిన్న చిన్న అంశాలే పెద్దవాటికి దారి తీస్తాయి.  మార్కులతో పిల్లల మధ్య పోలికలు పెట్టకండి. 
మీ మీ మతానుసారం ప్రార్థన ఆలయాలకు పిల్లలను తప్పనిసరిగా తీసుకెళ్లండి. మత గ్రంథాల సారాంశాన్ని అందించండి. జీవన విధానంలో.... కష్టపడి సంపాదించు ఇతరులది లాక్కోవద్దు.... ఇదే నేరానికి ప్రవృత్తి నిర్మూలనకు మూల మంత్రం అవుతుందని  గ్రహించే లాగా చేయండి. ఒక లాక్కోవడం అనే అంశం రూపా రెడ్డిని దారుణంగా చంపేటట్లు చేసింది.
పాఠశాలల్లో ఏం జరగాలి?
పిల్లలు ఉపాధ్యాయుల మధ్య ప్రేమ బంధం ఏర్పడాలి. బంధం ఉంటే ( connect)  మాట వింటారు. 13 నుండి 15 సంవత్సరాల పిల్లల వయసు వెట్ సిమెంట్ లాంటిది తొందరగా గట్టిపడుతుంది. ఉపాధ్యాయులు సాధ్యమైనంతవరకు ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు. ఎవరితో తిరుగుతున్నారు గమనించాలి (control content). స్పోర్ట్స్ సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, గ్రీన్ కార్ప్స్ లాంటి సేవా విభాగం పిల్లల లోనిమగ్నం చేయాలి. energy ని చానలైజ్ చేయాలి. Cognitive control 
మనోనిగ్రహం కోసం ప్రత్యేక మెడిటేషన్, యోగ తరగతుల ను నిర్వహించాలి. పిల్లలకు సరైన గైడెన్స్ కోసం (recognize) గుర్తించండి. వాళ్లలోని ప్రత్యేకతను (redirect ) వారిని co..curricular activities పైకి దారి మళ్ళించండి.
Reconnect తిరిగి కలపడం కుటుంబం గురువు సమాజంతో బంధం ఏర్పరిచే విధంగా తరచుగా పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించాలి. 
మారుతున్న కాలానికి అనుగుణంగా
ప్రతి పాఠశాలలో ఒక కౌన్సిలర్ ఉండటం మంచిది.  వారి పర్యవేక్షణ నిరంతరం అవసరం. కౌన్సిలర్ పిల్లల ప్రవర్తన కు మూలం కనుగొని తనను కూడా చర్యలు తీసుకుంటాడు. కెరీర్ గైడెన్స్ను అందిస్తాడు. టీచర్లు తేలికపడి వాళ్ళు అకాడమిక్ అంశాల  పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.
డ్రగ్స్ ఆల్కహాల్ అడిక్షన్ నుండి మొబైల్ అడిషన్ నుండి కౌన్సిలర్ దూరంగా తీసుకెళ్తాడు. తల్లిదండ్రులకు మార్గదర్శనం అందిస్తాడు. కౌన్సిలర్ వలన మనో నియంత్రణ పిల్లల్లో అలబడుతుంది. 
టీచర్లపై దాడులు రూపా రెడ్డి ప్రిన్సిపల్ లాంటి హత్యలు పునరావృతం కాకూడదని పాఠశాల దేవాలయాన్ని దాని పవిత్రతను కాపాడుదాం.
కామెంట్‌లు