దత్తపది:- మమత ఐలహైదరాబాద్9247593432

 కల తల వల శిల లతో కరువును వర్ణించుట
కం
కలలకు కరువులు ముసిరిన
తలచినభావనకుమిన్న దారిని వెతకన్
వలచిన సమయము వచ్చును
శిలగానిలుచుండకెపుడు శివ సన్నిధిలో
సమస్యా పూరణ
తే.గీ
ఉగ్గు పాలతొ నేర్చెడి పగ్గ మిదియె
సులభ రీతిలో వచ్చునే శుభము కోరి
కఠిన దారులన్ వెతికేడి ఘనతకంటె
*మాతృభాషలో చదివిన మనసునిండు*
కామెంట్‌లు