వైద్యో నారాయణోహరి:-*బెజుగాం శ్రీజ**ట్రిపుల్ ఐటీ బాసర**గుర్రాలగొంది* *జిల్లా: సిద్దిపేట**చరవాణి: 9391097371*
1 *ఉత్పలమాల*
వ్యాధులువచ్చినంతటను-
వైద్యులుజూసియుబాగుజేయునే
స్వేదమునోడ్చినన్ మిగుల -
క్షేమముకోరుచు రోగి సేవలన్
చోదముపొందుచుండిరిల
చోద్యము గాదిది వైద్య సేవలున్
త్యాగముజేయుచున్ తిరిగి
తన్మయ మొందుచు నుండిపోదురే

2 *మత్తకోకిల*
దైవమూర్తులు వైద్యు లందరు
ధాత్రి మెచ్చగ వైద్యమున్
సేవజేసియు రక్షనివ్వగ
క్షేమమొందిరి రోగులే
కోవిడందున కష్టమొచ్చిన
కోరివ్యాక్సినె యిచ్చిరే
వావిబేధము చూపకుండియు
బాగుజేసెను బాధలన్


కామెంట్‌లు