పెరుగుతూనే ఉంది అను నిత్యం
గమనిస్తే ఊహిస్తేమనకు వాస్తవం
తలుస్తూందిలే ఓ నిజమైన సత్యం!
పుట్టిపెరిగిన ప్రపంచ జనమందు
ఒట్టిగ కూర్చోని తినేవారికే విందు
పనిచేసేవారికేమొ ఇక దారి బందు
గమనించి ముందుకెళ్ళుటే పసందు
జనాభాతో నిండిన ఈ భూగోళం
సృష్టిస్తుంది మనలో గందరగోళం
ఆహారం సరిపోక ఇక ప్రతి వేళ
మనందరిలోన ఒకటే గోల గోల !
తలెత్తుతుంది ఆహారం సంక్షోభం
కాలెత్తేస్తుంది మనదేశం సంక్షేమం
వేలెత్తి చూపుతుంది ఇక పరదేశం
జోరెత్తి ఇవ్వాలిరా నీ స్వరసందేశం
మన జనాభా కట్టడికి గతమందు
ఆపరేషన్లుచేస్తిమి మనంముందు
అప్పటికి ఆ కార్యం బహు పసందు
ఇక్కట్లలో చిక్కుకోకు నీవికముందు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి