స్మార్ట్ ఫోన్:-ఎ. గజేందర్ రెడ్డి-9848894086

తెల్లారిందగ్గర్నుంచి
తననె చూడుమంటున్నది
చూడకుండ ఉండలేని
పరిస్థితిని తెస్తున్నది

స్మార్ట్ ఫోన్ కళ్ళముందు
కదుల్తూనె ఉంటది
అనుక్షణం నా మదిలో
 మె దుల్తూనె ఉంటది

పగలైనా రేయైనా
పని ఉన్నా లేకున్నా
తింటున్నా పంటున్నా
వెంటాడుతునే ఉంటది

మాటలతో బులిపిస్తది
పాటలతో మురిపిస్తది
దృశ్యాలతొ అలరిస్తది
ప్రపంచాన్ని చూపిస్తది

నేను వీడుతానన్నా
నన్ను వీడనంటున్నది
'నన్ను వదిలి నీవు పో
లేవులే ' అంటున్నది

   
కామెంట్‌లు