తెలుగు బాల పదాలు::-అ ష్ట ది క్పా ల కు లు--శంకర ప్రియ., శీ ల.,సంచార వాణి: 99127 67098

 👌 అష్ట దిక్పాలకులు
       భువిని సంరక్షకులు
       దివి నున్న దేవతలు
                  ఓ తెలుగు బాల!
                    * * * * *
👌సకల మానవాళికి
     ఇష్ట దైవ మూర్తులు
     అష్ట దిక్పాలకులు
                ఓ తెలుగు బాల!
                   * * * * *
               ( నాలుగు దిక్కులు, నాలుగు విదిక్కులు, వెరసి... ఎనిమిది దిక్కులకు పరి పాలకులు. వారు వరుస గా.. "దేవేంద్రుడు, అగ్ని దేవుడు, యమ ధర్మరాజు, నిర్రుతి, వరుణ దేవుడు, వాయు దేవుడు, కుబేరుడు, ఈశానుడు.." అను వారే అష్ట దిక్పాలకులు! )