మితంగా.:-తాటి కోల పద్మావతి గుంటూరు

 స్వప్న ఆఫీస్ కి వెళ్ళిన రోజుల్లో జీతం తెచ్చి భర్త చేతిలో పెట్టేది. రాంబాబు తన జీతం ఇంటి ఖర్చులకు వాడకుండా బ్యాంకులో వేసేవాడు. భార్య జీతంతోనే ఇల్లు గడుపుతున్నాడు. పిల్లల చదువులు స్కూల్ పిల్లలు కట్టాలన్నా అన్ని రాంబాబు లెక్కలు వేసి ఖర్చు పెట్టేవాడు. రాంబాబు కి ఎన్నో కోరికలు ఉన్నాయి కారు కొనాలని ఇల్లు కట్టాలని ఊహించు కునే వాడు. అలాంటిది స్వప్న ఆఫీసు ఆర్థికంగా మూతపడటం వలన ఉద్యోగం లేక ఇంట్లోనే కూర్చుంటుంది. మరో ఉద్యోగం వెతుక్కోవాలి అంటే అంత తొందరగా అయ్యే పనులు కావు. ఆరోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్ళు ఉద్యోగం చేయాలను కోలేదు. జీతం రాళ్లు సంపాదించి చేతులో పోసిన రోజులు భార్యని బాగానే చూసేవాడు. ఉద్యోగం మానేయగానే భర్తలో మార్పు వచ్చింది. చీటికి మాటికి విసుక్కోవటం ఆయన దానికి కాని దానికి నోరు చేసుకోవడం బయటికి వెళ్దామంటే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని నాకు తీరుబడి లేదనే వాడు. పండగ వచ్చినా పబ్బం వచ్చినా చీర కొనడం మానేసాడు. పిల్లల్ని షికారుకి తీసుకు వెళ్ళటం లేదు. ఉదయం యం ఆఫీసుకు వెళితే సాయంత్రం ఇంటికి వస్తాడు. స్వప్న పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చి వంట చేసి బాక్సులు పిచ్చి వచ్చేది. ఆరోజు ఆదివారం కావడంతో పిల్లలు సరదాగా సినిమాకు వెళతామన్నారు. ఇక్కడ అ మీ అమ్మ సంపాదించే మూటలు లేవు నా ఒక్కడి జీతంతోనే ఇల్లు గడవాలి. బయట ఖర్చులు తగ్గించుకుంటే మంచిదన్నాడు. ఇద్దరి సంపాదన ఉంటే అన్ని నీ సమకూర్చుకోవచ్చు. పెళ్లికి ముందే నువ్వు నువ్వు ఉద్యోగం చేయాలని చెప్పాను ఇల్లు కారు కొనాలని ప్లాన్ వేసుకున్నాం ఇప్పుడు అన్ని శూన్యం అయిపోయినాయి. మా ఫ్రెండ్స్ అంతా మనకంటే ఒక మెట్టు పై అంతస్తులో ఉన్నారు మన దరిద్రం ఇలాగే ఉంది అంటూ బాధపడ్డాడు. సరదాలు మీకు లేకపోవచ్చు నా ఆరోగ్యం అంత బాగాలేదు అందుకే కొన్నాళ్లు ఉద్యోగం చేయదల్చుకోలేదు పిల్లల సరదాలు తీర్చడం మన బాధ్యత కాదా అన్నది స్వప్న. మళ్లీ నాకు తెలియదు నా టార్గెట్ నేను నేను పూర్తి చేసే వరకు ఇలాగే ఉంటాను అన్నాడు. తన కోరికలు తీరటానికి అడ్డమైన సంపాదన కోసం అడ్డమైన దారులు తొక్కడం మొదలుపెట్టాడు. లంచం లేనిదే పని చేయడు. చేతినిండా డబ్బు కళ్ళ చూసేసరికి మనసులో కొత్త కోరికలు పుట్టగొడుగుల్లా వచ్చాయి. స్నేహితులతో చేరి పార్టీలో ఉంటూ తాగటం మొదలు పెట్టాడు. అసలు కోరికల్ని పక్కనబెట్టి తాగుడుకు బానిసయ్యాడు సంపాదించింది తాగుడుకే సరిపోతున్నది. ఇల్లు వాకిలి భార్య బిడ్డలు పట్టించుకోవడం మానేసాడు. ఆ మత్తు లోకంలోనే ఉండిపోవటం అలవాటయింది. కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రి పాల్ అయ్యాక గాని తెలియలేదు కోరి తెచ్చుకున్న రోగం అని. తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయాయి సరైన వైద్యం చేయించకపోతే ప్రాణాలకే ముప్పు ఉన్నారు. చివరికి ఇల్లు గడవడం కూడా కష్టమైంది. మళ్లీ స్వప్న చిన్న ఉద్యోగం వెతుక్కుంది భర్తకు వైద్యం చేయించి తాగుడు దూరం చేసింది. పరిస్థితుల ప్రభావం మనిషి మీద అ దెబ్బ కొడుతుంది సంపాదనే ధ్యేయంగా పెట్టుకోకూడదు. ఏదైనా నా విధంగానే ఉంటే మంచిది. స్వప్న జీవితం ఇంటికి ఆధారమైంది. రాంబాబు కళ్ళు తెరుచుకుని ఉన్న దాంట్లో తృప్తిగా బతికితే ఈ కష్టాలు వచ్చేవి కావు గా అని తెలుసుకునే టప్పటికి ఆలస్యమైపోయింది. భార్యమీద కోపంతో తన పతనానికి తనే గొయ్య తీసుకున్నాడు.