తెలుగులమ్మ పిల్లలం:---గద్వాల సోమన్న
తెలుగుతల్లి తోటలో
వెలుగులీను  పూవులం
భారతమ్మ మోములో
విరబూసిన నగవులం

పరిమళాలు వెదజల్లు
పారిజాత సుమములం
కన్నతల్లి కంటిలో
ఆనందపు జల్లులం

తెలుగుతోట

మొగ్గలం
వెన్నెలమ్మ బుగ్గలం
అక్షర నక్షత్రాలం
లక్ష్యమున్న  బాలలం

తెలుగుతోట చక్కదనము
పచ్చపచ్చని మొక్కలం
పదపదమున తీయదనము
తెలుగులమ్మ పిల్లలం