కార్తికేయుడు,రమణి(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

       :కార్తికేయుడు:
శక్తి హస్తము వేలాయు ధమును  కలిగి 
ఆరు ముఖముల‌ స్కంధుడు‌ నాగ రూప
జ్ఞాన తత్వము కలిగిన‌ జ్ఞాని యతడు
బాల ముఖముతో నిలిచిన బాహు బలై

             :రమణి:
రమణి యేతెంచె కోపము రగులు కొనగ
వాణి వినిపించ మరియును వాదు లాడ
రాణి విషయము తేల్చగ రాజు తోడ
తాను సంరంభ వానితో తాప మలర
కామెంట్‌లు