నమో భారతావని-:-మచ్చ అనురాధ--సిద్దిపేట
 
సీసమాలిక
భారతమాతకు పాదాభివందనం
వేదాలకు నిలయం వేదభూమి,
వేనోళ్ళ కీర్తించు వీరమాతను జూసి
పుణ్య మూర్తులగన్న పుడమితల్లి,
దేశదేశాలకు దివ్య మార్గంబును


జూపి నడిచెనిల చూపరులకు,
సంస్కృతి యాచార సాంప్రదాయాలకు
విలువల నిచ్చిరి వేద మెరిగి,
కర్మభూమినిదియు ఘనమైన దేశము
ధర్మ మెరిసాగు ధరణి నెపుడు,
పుణ్యకార్యములను పొందుగా జేయుచున్
జీవనమ్ము గడుపు సేవజేసి,
మానవ సేవయే మాధవ సేవగా
భావించి బ్రతుకుట పరమభక్తి,
భారతావని నమో భవ్య చరిత గల
దేశమ్ముమనదిరా తేజ మలర.
తేటగీతి
కట్టుబొట్టు తీరు గనక కనులవిందు,
సకల దేశాలు ముదమొప్ప జనుల నడక,
సర్వజనులకాదర్శము జగతినందు,
భారతావని సంస్కృతి పావనమ్ము.

కామెంట్‌లు