ఆహా వనభోజనం:--- మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
సీసమాలిక

తొలకరి కురిసిన దుక్కి దున్నియు రైతు
పుడమి తల్లికి మొక్కి పూజ జేయు,
పంట చేలన్నియు పచ్చగా పెరుగగన్
ఆషాడ మాసము హాయి నొంద,
వనభోజనాలకుపంటపొలములలో
చెట్ల మధ్య జనముచేరియాడు,
గ్రామ దేవతలకు ఘనమైన బోనాలు
కల్లు సాకల తోడ కలిసి జేయు,
భేద భావము లేక పేర్మితో  భోజనం 
ముచ్చట లాడుచు జేయు ముద్దుగాను,
మేక పోతుల బలి మెండుగన్ యిచ్చేరు
పల్లెలందునిదియుపర్వదినము
విందులు మందులు వీలైతె చిందులు
చూడముచ్చటగనుచూపరులకు,
ఆహావనములోనహాయిభోజనమని
బాధలన్నిమరచి పరవశించు.

తేటగీతి

స్నేహ భావముతోడనుచేరి యంత,
కలిసిమెలిసి పోవుదురిల కలత మాని,
పంక్తి భోజనమల తోడ పట్టు వీడు,
మరువలేనిదీ భోజనం మదిన నిలుచు.