సీసమాలిక
మనదేశ సంస్కృతి మహనీయ మైనది
దేశదేశాలకు దీప్తినిచ్చు,
పుట్టినది మొదలు పూర్వ జన్మ లకర్మ
లనుకుంటూ కష్టాలన్ని పడుచు,
భగవంతుడా నాకు పరమ పదవి నివ్వు
భరియించ లేనుయీ బాధలన్ని,
కోరుకుంటు నరులు కుమిలిపోవుచువారు
గతములో వేడిరి కలతజెంది,
పాడు కరోనాకు భయపడి జనులంత
ప్రాణాలు గుప్పిట్లొ పట్టుకొనియు,
మనుషులందు కలిగె మరణ భయముజూడ,
ప్రాణాంతకమువ్యాధి వణుకు బుట్టె,
న్నూపిరి కొసపైన యున్నసమయమున
ప్రాణ తీపి పెరిగె బ్రతుకు పైన,
బంధాలు విడిచిరి పరులు మరణమొంద
పలకరింపులు లేక బ్రతుకు గడప.
తేటగీతి.
కరుణలేని కరోనాకు కనికరమ్ము,
లేదు కాటువేయగ మందు లేదు యెందు,
శొంఠి మిరియాల పొడివాడు చోద్యమనక,
వేడి నీటిని త్రాగాలి వేగిరమ్ము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి