నిజాయితీగా నే ఆలోచిస్తుంది- ప్రతాప్ కౌటిళ్యా
 పర్వతాన్ని పడగొట్టి శిల్పాన్ని చెక్కాలనుకుంటున్న
  శరీరాన్ని మొత్తాన్ని పిండి ఒక గుండెకాయ సృష్టించాలి అనుకుంటున్నా
 అడుగుల్ని ఒకదానిమీద ఒకటి పేర్చి 
నిచ్చెనల్నీ నిలబెట్టాలి అనుకుంటున్నా
 చెట్లకు ఊపిరితిత్తులను అమర్చి ఆక్సిజన్ను అందించాలి అనుకుంటున్నా
 చేపలకు ఆకలి కోసం జీర్ణాశయాన్ని దానం చేద్దామనుకుంటున్నా !?


 వస్తువులకు బాషల్నీ నేర్పించి వ్యాపారం చేసుకుంటే మాటల్ని వ్యవహారాన్ని
 అంగళ్ళలో అమ్మాలనుకుంటున్నా!?

  ఒక్కసారి దిక్కుల్ని బంధించండి
 దారుల్ని దిగ్బంధంలో కి నెట్టివేయండి!?

 ఆకాశాన్ని శూన్యాన్ని సందు లేకుండా సంచుల్లో నింపి వేసి సముద్రంలో దాచి ఉంచండి!?
 చెప్పలేం
 రేపటికి అవీ కళ్ళు చెవులయి   చూపుల్ని మాటల్ని చేప పిల్లల తల్లులకి అనువాదం చేసి నిజాన్ని అంగీకరించే టట్లు చేసి
 మరో ఆవాసం లోకి అవలీలగా బదిలీ చేయొచ్చు!?

 ఆలోచనల పుట్టుకను లెక్క పెట్టి వాటి రెక్కల్ని 
ఇనుము తో నిర్మించీ, వాటి ముక్కుల్నీ ఉక్కుతో
 తొడిగి
 ఎగరేసుకుపోయే ఇవాల్టి వార్తల్నీ  మోసుకుపోవడానికీ, చిరునామా చివరి క్షణం దాకా  దాచి పెట్టి వాటిని ఎగుర నివ్వండి
 పొడిచి పొడిచి రాబందుల్లా రక్తం త్రాగనివ్వండీ!?

 మొలిచిన కలల్ని ఎప్పటికప్పుడు  ఏరిపారేసి మట్టి మొగ్గల్నీ విచ్చుకునే ట్లు మాంసపు ముక్కల్ని కత్తిరించి ఆలోచనలఅస్థిపంజరాన్ని నిజాయితీ శరీరాన్ని నిర్మించి
 లోకంఅడ్డుగోడ లకు వేలాడదీసి, దిష్టి బొమ్మను దగ్దం చేయండి!?

 ఎప్పటికో గాని రానీఆ మనిషిని ముందుగానే ఊరి పొలిమేరలో అబద్ధాల ఏడంతస్తుల అద్దాలమేడ లో ఉంచి
 అందగత్తెను కాపాలా ఉంచండి !?

 గొంతులో దిగిన కత్తుల్ని ఒరలో దాచినట్లూ
 నిశ్శబ్దాన్ని చూసి మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీద కత్తి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని మరిచిపోకండి!?

 అంతరంగాన్ని ఆవిష్కరించిన నరాలు
 ఒకదానితో ఒకటి పోటీ పడి చిట్లి పోయినట్లూ 
 వెన్నుపాము నిర్ధారిస్తుంది!?

 మేల్కొని  రక్తసరఫరా ఆపివేస్తే  నీళ్లు మాత్రమేనిండు ప్రాణాన్ని నిలబెడుతుంది!?

 చిత్రంగా కపాలం లోని మాంసపు ముద్ద
 మళ్లీమళ్లీ తెలివిగా కాదు
 నిజాయితీగా నే ఆలోచిస్తుంది నిన్న ఇవ్వాళా రేపు!?

                    pratapkoutilya