ఏమమ్మా గొల్లవనితలారా ఇలావచ్చారు అందరూ ఒక్క సారిగా
ఏమనుచునుచున్నారూ
నాచిన్ని కృష్ణుడు మీ మీ ఇళ్ళలో వెన్నా పాలూ దొంగిలిస్తున్నాడా
నా బిడ్డ నన్ను వదలి ఒక్క క్షణమైన వుండడే మీ ఇళ్ళకు ఎప్పుడు వచ్చాడు వెన్నాపాలూ ఎప్పుడు కుడిచాడు
అయినా వెన్నా పాలూ మాఇంటిలో కడవలాదిగా వుంటాయని మీకుమాత్రం తెలీయదా మరి నాబిడ్డకు మీ ఇళ్ళకు రావలసిన పనేమి
నందరాజు బిడ్డకు
పాలూ పెరుగూ దొంగతనం చేయవలసిన కర్మేల పట్టును.
ప్రాకడమే చేతగాని నా పాపడిపై ఇంతింత నిందలు వేయడానికి మీకు మనసెలా వస్తోంది
ఆ ఏమిటీ తానొక్కడేకాదా వాడలలోని గొల్లపిల్లలందరినీ తెచ్చి ఉట్టిలోని వెన్నచట్టిలు పగులకొట్టి వెన్ననంతా పంచుతున్నాడా
ఏవమ్మా గొల్లభామలూ
పాలుతాగే పసిబిడ్డపై ఇంతింత నిందలు వేయడం మీకు తగునా
ఉట్టిపైనున్న కుండలు పాకడమేరాని పసిబాలుడికి ఎలాఅందుతాయి
ఎందుకు నా బిడ్డపై ఇంతింత నిందలు మోపుతున్నారు
మీరూ పిల్లల తల్లులేకదా
బిడ్డలపై చాడీలు చెపితే
ఆ తల్లిమనసు ఎంతటిగాయపడుతుందో మీకుమాత్రం తెలియదా
మరొక్కమారు నా బాలకృష్ణునిపై నేరం చెప్పారంటే వాని తండ్రి నందరాజుతో చెప్పి మిమ్ములను శక్షింపజేయగలను.జాగ్రత.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి