నెమలి:(బాల గేయం)-యెల్లు అనురాధ రాజేశ్వర్ రెడ్డి-జడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి తెలుగుభాషొపాధ్యాయురాలు

మహిలోన మయూరం
 బహు వర్ణ శోభితం
 శ్రీకృష్ణ కిరీటం
 అలరిన మయూరం
:: మహిలో::

 చిత్రమైన చిత్రాలకు
 కుంచవై కులికేదవు
 పుస్తక పుటలలో
 పింఛపు  పలకరింపు 
::మహిలో::

 పురివిప్పిన పింఛము 
ఇంపుగా కనిపించును
 నీనృత్య భంగిమలు
 మనసును మరిపించును 
::మహిలొ::


 నాట్యమయూరి వై 
జగతికి చైతన్యమై
 నిండు మనసు నేస్తమై
 సృష్టికి రారాణి  నీవు
:: మహిలో::