దేవుని దయ లేనిదే మనం ఏపని చేయలేము.ఏదైనా దై
వసంకల్పంగా భావించాలి.శివుని ఆజ్ఞ లేనిదే చీమకూడా కుట్టదు. ఆముష్టివాడు బాటపై అడుక్కున్నా అతని జోలె నిండలేదు. కేవలం ఓపిడికెడు గింజలు ఉన్నాయి అంతే. ఇంకాసేపు కూచుంటే జోలె నిండుతుంది అని ఆశపడ్డాడు.కానీ ఆ ఆశ నిరాశే అయింది. తన గుడిసె వైపు కాళ్ళు ఈడ్చుకుంటూ బైలుదేరాడు. ఎదురుగా రాజుగారి రధం కనపడటంతో బాగా ఆనందించాడు. "రాజుగారు నాకు కోరినంత డబ్బు బంగారం ఇస్తారు అని" మురిసిపోయాడు.
వెంటనే ఆ రథం ముందు వెళ్లి నించున్నాడు. రాజుగారు ఆబిచ్చగాడి ముందుకు వచ్చి నించున్నాడు. ఆశ్చర్యం!ఆయన తన చేతిని అతని ముందు చాపి "బాబూ!మీదగ్గర ఏమైనా ఉంటే నాకు ఇవ్వవా?" బిచ్చగాడు బిత్తరపోయాడు."ఎదురుగా నిలబడింది రాజుగారు. వెంటనే తన జోలెలో చేయిపెట్టి చేతికి అందిన ఓ పదిగింజలు రాజుగారికి ఇచ్చాడు. రథం ఎక్కి వెళ్లిన ఆయనవైపు చూస్తూ ఇంటికి వెళ్ళాడు. హు. ..ప్రపంచంలో జనం ఎంత పిసినారులు!డబ్బున్న మారాజు కూడా ముష్టివాడిని అడుక్కునే స్థితికి దిగజారాడు. మానవత్వం దయ దాక్షిణ్యం నామరూపాలు లేకుండా పోతున్నాయి."అనుకుంటూ తన జోలె లోని బియ్యపు గింజలు నేలపైకి విసిరి కొట్టాడు. ఆశ్చర్యం!తను ఇచ్చినన్ని బియ్యపు గింజలు బంగారు రంగులో మెరవసాగాయి."హు..నేనెంత మూర్ఖుడిని!ఆయన రాజు కాదు.భగవంతుడే దిగివచ్చి నన్ను దానం అడిగాడు. పిసనారితనంతో కొన్ని గింజలు ఇచ్చాను.అవి ఇస్తే మొత్తం బంగారం అయ్యేది కదా?" మనిషి బుద్ది ఎంత అల్పమో చూశారా?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి