..దాశరథి;-అంజయ్యగౌడ్

ధ్రువకోకిల గర్భ సీసము
సీ..
దొర,నిజామునెదిర్చి దూకుచు దొడ్డగా                
రణమందునన్ వేడ్క రాజిలంగ
తరిమివేతుమునిన్ను తస్కర తక్షణం            
 బిపుడేయనీవేగ విప్లవమతి
నురుముచున్ గురిపించె నుగ్ర మహోగ్రుడౌ                     
 చును నిప్పులన్ వరశూర మతిగ
మరువ రానటువంటి మాన్యు డు మాననీ                     
యుడు ధన్యుడోయన పిడుగు వలెను

గీ..
నాతెలంగాణ కోటిరత్నాలవీణ
యనుచు నెలుగెత్తి సాటిన ఘనుడతండు
క్రూరులైనట్టి యారజా కారుల నిల
తరిమి గొట్టగ పిలుపిడె దాశరథియు

ధ్రువకోకిల

దొర నిజాము నెదిర్చి దూకుచు దొడ్డగా రణమందునన్
తరిమివేతుము నిన్ను తస్కర తక్షణంబిపుడేయనీ
యురుముచున్ గురిపించె నుగ్ర
మహోగ్రుడౌచును నిప్పులన్
మరువరానటువంటి మాన్యు డు మాననీయుడు ధన్యుడో