వచన కవితలు :-చెన్నా సాయిరమణి
1)వీనిత తా మన్మిత విధిత 
మమత ముదిత లత చరిత 
విజేత భారత జీవిత భవిత భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

2)కల్పన వదన బోధన కేతన 
సోధన సాధన జీవన నయన 
భావన గమన పావన కవన భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

3)చిత్ర విచిత్ర వైచిత్ర లలిత 
సుందర పద విన్యాస గద్య 
మాధుర్య నవ్య శ్రావ్య వచన భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

4)మహోత్కృష్ఠ మహక్కర మకరంద మధ్యక్కరలు 
అద్భుత అంతరాక్కర అనంత అల్పక్కరలు 
తియ్యని తేటగీతి ఆనంద ఆటవెదుల భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

5)పద విజ్ఞాన కావ్య శోభల 
కవన మాధుర్య పద్య పరిమళంబు 
మిళిత మధురాతి మధుర పరమానంద భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !


కామెంట్‌లు