(కొనసాగింపు)
5.తిండి ఇల్లు దాటింది!
పాకావిలాస్ లు - మెస్ లు!
టిఫిన్ సెంటర్లు- నడిచేస్టాల్స్!
రోడ్డుపక్కతిళ్ళు-ఫాస్టుఫుడ్స్!
హోటళ్ళు- స్టార్ హోటళ్లు!.
6.
పంచె,కండువా-ఫ్యాంటుషర్టు
ఆడ/మగ- జీన్స్,టీషర్ట్స్!
చీర జాకెట్-
పగలైనా నైటీయే బెస్టు!
పిల్లల డ్రెస్సు-అప్ టు డేట్!
*లో* దుస్తులు- *లో* రేటా?
జోళ్ళు- రోజుకో మోడలే!
7.
గుడిసెలు- తాటాకు ఇళ్ళు!
పెంకుటిళ్ళు-పెక్కువాటాలు!
సొంతఇళ్ళు--డాబుడాబాలు!
స్లాబుఇళ్ళు- అపార్ట్మెంట్స్!
గేటెడ్ కమ్యూనిటీస్----
విత్తంకొద్దీ వైభోగమే!
8.
వ్యసనం రూపం మారింది!
చుట్టలు,బీడీలు-సిగరెట్లు!
వక్కలు,కిళ్ళీలు- గుట్కాలు!
కల్లుపాకలు-సారాకొట్లు!
మద్యం దార్లు-తెరిచినబార్లు!
*(రేపు కొనసాగింపు)*
----------------------------------------
*పరిణామం!*:- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి