ఆద్య స్కూల్ కు రేపటి నుంచి సెలవులు : - టి. వేదాంత సూరి

 ఆద్య స్కూల్ కు( తమహో స్కూల్ ) రేపటి నుంచి రెండు వారాల పాటు సెలవులు. అందుకోసం స్కూల్ చివరి రోజు( అంటే శుక్రవారం ) ఫాన్సీ డ్రెస్ తో  రమ్మని టీచర్స్ చెప్పారు. ఆద్యకు మోనా కార్టూన్ చిత్రాలంటే చాలా ఇష్టం. తన పుట్టిన రోజు కూడా అటువంటి డ్రెస్ వేసుకుని కేక్ కట్ చేసింది. స్కూల్ కు కూడా అదే డ్రెస్ తో వెళతానని నిర్ణయించుకుంది. మేము కూడా స్కూలుకు వెళ్ళాం. అక్కడికి అందరూ రకరకాల దుస్తుల్లో వచ్చారు. అందరిని చూస్తూ ఆరియా ఒకటే సందడి. 
ఇక ఆద్య తాను క్లాస్ లో ఏం చేసింది , తన భావాలు ఏమిటి, స్నేహితులతో ఎలా వుంది అనే  అంశాలను చిత్రాలు, అక్షరాల రూపం లో మా ముందు ఉంచింది. ఇక్కడ చదువులో పిల్లల ప్రగతిని టీచర్స్ చెప్పకుండా  పిల్లలతోనే చెప్పిస్తారు. ఇలా చేయడం మాకు బాగా నచ్చింది. ఒక బొమ్మ చూపించి, దానికి తగిన కథ కూడా చెప్పమంటారు. ఆద్య కూడా చక్కగా కథలు చెప్పిందట . . పిల్లలకు ఇలా ఐదవ ఏట నుంచే సృజనాత్మకత అలవాటవుతుంది. అక్కడికి పిల్లల అమ్మ నాన్నలతో పాటు తాతయ్యలు, నానమ్మలు , అమ్మమ్మలు వచ్చారు .  అందరినీ పాఠశాల యాజమాన్యం సాదరంగా ఆహ్వానించింది . అందరికి స్నాక్స్ కూడా ఇచ్చింది. 
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో స్కూల్స్ కు ప్రతి మూడు నెలలకు ఒక సారి 15 రోజులు సెలవులు ఇస్తారు. ఆ సెలవుల్లో తల్లిదండ్రులు వివిధ ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్ళడానికి నిర్ణయించుకుని పిల్లలతో కాలక్ష్యేపం చేస్తారు.