ప్రకృతి అందాలు: వెంకట రమణ రావు

 నాన్నా రోజంతా సూర్యుడు ఎందుకు ఉండడు. సాయంత్రం అయితే ఎందుకు వెళ్ళిపోతాడు. రాత్రి అంతా చీకటి అయిపోతుంది. సూర్యుడు ఉంటే ఎంచక్కా ఇంకా ఆడుకోవచ్చు. స్కూల్ లో ఉండచ్చు. కదా నాన్నా. మరి సూర్యుడు మనకి రోజంతా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు మా చిన్నా.
ఒక్క నిమిషం ఆలోచించాను. ఈ పసివాడికి ఏం చెప్పాలి.
చూడు చిన్నా, రాత్రి అయితే నువ్వు నక్షత్రాలు చూస్తావు కదా. నీకు నక్షత్రాలు లెక్కపెట్టడం ఇష్టం కదా. అలాగే చందమామ కూడా నీకు చాల ఇష్టం. సూర్యుడు వేడి కదా మనం చూడలేము ,అదే చందమామ చూడు ఎంత చల్లగా ఉంటుందో. వెన్నెల ఎంతబాగుంటుందో కదా. రోజంతా కష్టపడి పనిచేసి వచ్చిన వాళ్ళు రాత్రి చల్లగా ఉంటుంది కాబట్టి హాయి గా నిద్ర పోతారు.  మనుషులు పక్షులు, జంతువులు , చెట్లు అన్నీ కూడా రాత్రి విశ్రాంతి తీసుకుంటాయి. మళ్లీ సూర్యుడు వచ్చేసరికి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు.
రాత్రి అందాలు చూడాలంటే పగలు వెళ్లిపోవలసిందే కదా.
సూర్యుడు చంద్రుడు వాళ్ల  పనులని ఇలా పంచుకున్నారు. అర్థం అయిందా చిన్నా.
అవును నాన్నా రాత్రి కూడా ఎంత బాగుంటుందో, బాగా నిద్ర పోవచ్చు అంటూ చిన్నా నన్ను గట్టిగా వాటేసుకున్నాడు.
ప్రకృతి లో అందాలు ఒకటొకటిగా మారిపోతూ ఉంటాయి. ఒక అందం కనుమరుగు అయితే మరో అందం మన ముందుకి వస్తుంది. పగలు రాత్రి , ఋతువులు , ఇలా దేని పని అవి చేసుకు పోతాయి. ఏదీ కూడా శాశ్వతంగా ఉండదు.
ఇదే జీవిత పాఠం.
Venkata Ramana Rao
Visakhapatnam
mobile 9866186864
కామెంట్‌లు