ఆమె మెత్తటి పాదాలు తగిలిన
గడ్డిపరకలు
పడమటి గాలి తాకి లేచి నిల్చుంటున్నాయి.
ఆమె చేయి తగిలిన చెట్లకొమ్మల
ఆకులు గాలివాటుకు కదులుతున్నాయి.
ఆమె పయనమై వస్తున్న సంగతిని
తెలిపేందుకు పిల్లతెమ్మెరలు తన ముంగురులను స్పృశించి
చల్లగా వస్తున్నాయి.
ఏ గాలి వీచెనో గాని,
తన మేని పరిమళాన్ని మోసుకొస్తున్నాయి ఆఘ్రాణించగా.
సుమగంధాల శుశ్రూషలతో
పవనప్లావితమైన తనువు
తన రాక కోసం ఎదురుచూస్తున్నది.
తన పేరునే జపిస్తున్నది.
పవనసందేశం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి