ఆదిశక్తి అంశ
సహనశీలి అతివ
రూపులో దైవాంశ
ప్రేమను పంచే మగువ
వారెవ్వా!స్త్రీమూర్తి
ఇలలోన ఘణకీర్తి.
తనువు త్యాగమయం
పిల్లలే తన ఊపిరి
అనువనువు అమృతమయం
ఇంతి సౌభాగ్యపు సిరి
వాహ్వా!ఆనందమయి
సుదతి ,ఆదర్శమయి
మూడు రూపాలకు అమ్మ
సృష్టికి మూలమైనది
చిత్రమైన జన్మ
నిరతం రక్షించునది
వారెవ్వా! మహంగన
వర్దిల్లు భువిపైన.
మోమున చిరు నగవు
తరగని తేజసు నిండుగ
తరుణికి సరిపోవు
సహజాకర్షణ మెండుగ
వాహ్వా!నెరజాన
సోయగాల భరిణ
ముగ్గురి పిల్లలకు
మచ్చటైన మాతృమూర్తి
సాటి ఎవరామెకు
తరుణిలకే ఆమె స్పూర్తి.
ఆహా!మాతృ దేవత
నెలత మందస్మిత.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి