మానవత్వం.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 హైదరాబాదులో గుంటూరు వెళ్లే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాడు రఘురాం. మరో పది నిమిషాల్లో ట్రైన్ వస్తున్నట్టు ఎనౌన్స్ మెంట్ వినిపించింది. ప్లాట్ ఫామ్ మీద జనం సిద్ధంగా ఉన్నారు. సమయం కాగానే ట్రైన్ రానే వచ్చింది రఘురాం రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లో ఎక్క పోతున్నాడు. పక్కనే ఉన్న ప్లాట్ ఫామ్ మీద ఏవో అరుపులు వినిపిస్తున్నాయి జనం గుంపులు చేరారు. ఎవరికో యాక్సిడెంట్ అయిందట. రఘురాం ఎక్కిన రైలు ఇంకా బయలుదేరడానికి సమయం ఉంది. గబగబా దిగి వెంటనే పక్కనే ఉన్న ప్లాట్ఫాం దగ్గరికి వెళ్ళాడు. ఎవరో పెద్దాయన పడి పోయి ఉన్నాడు ఆయన భార్య కాబోలు ఏడుస్తూ ఉన్నది హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని బతిమిలాడుతున్నట్లు. ఇంతలో వాళ్లు ఎక్కబోతున్న రైలు బయల్దేరుతుంది. వాళ్లని ఎవరు పట్టించుకోవడం లేదు. చూసినట్టే వెళ్ళిపోతున్నారు. రఘురాం వెంటనే వెళ్లి ఆ వ్యక్తిని చూడగానే షాక్ అయ్యాడు ‌ ఆయన ఎవరో కాదు తన తండ్రి స్నేహితుడు పరంధామం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నే అక్కడ పోలీసులకి ఇంఫాం చేసి వెంటనే అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు. డాక్టర్లు అన్ని టెస్టులు చేసి హార్ట్ పెయిన్ వచ్చింది హాస్పిటల్లో ఉండాలి అన్నారు. ముందుగా 50 వేలు డబ్బులు పెట్టమన్నారు. అంత డబ్బు తన దగ్గర లేదు ఏం చేయాలి. ముందు డబ్బు పెడితే గాని వైద్యం మొదలుపెట్టరు. ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు తల్లికి కళ్ళు ఆపరేషన్ చేయించాలి. ఇన్నాళ్లు ఉద్యోగం కోసం ఎదురు చూశాడు ఇప్పుడు రాగానే ముందు తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చాలి అనుకున్నాడు. ఆ డబ్బు కాస్త ఇక్కడ ఖర్చు పెడితే అమ్మ పరిస్థితి ఏమిటి. ఒక్కక్షణం ఆలోచించాడు. పరంధామం భార్య ఎలాగైనా తన భర్తని రక్షించమని వేడుకుంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జేబులో నుంచి ఆ డబ్బు తీశాడు కౌంటర్లో కట్టేసాడు వైద్య మొదలుపెట్టారు డాక్టర్లు. నెమ్మదిగా ఆమె కొడుకులకి ఫోన్ ద్వారా విషయం తెలియజేశారు. వాళ్ళు రావడానికి ఒక రోజు సమయం పడుతుంది. వాళ్లు వచ్చేవరకు అక్కడే ఉండవలసి వచ్చింది రఘురామ్ కి. కొడుకు ఇంకా ఇంటికి రాలేదని ఎదురుచూస్తున్నారు రఘురాం తల్లిదండ్రులు. హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టు ఫోన్ చేసి చెప్పాడు రాకపోవటానికి కారణాలు వెతుకుతున్నారు. ఈరోజు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను రేపు వస్తానని ఫోన్ చేసి ఇ చెప్పాడు తల్లిదండ్రులకు రఘురాం. ఏమైందోనని కంగారు పడుతున్నారు. పరంధామం కొడుకులు వచ్చాక రఘురాం ఇంటికి బయలుదేరాడు. మీరు మాకు చేసిన సాయానికి నీ రుణం తీర్చుకోలేం ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు కట్టిన డబ్బు ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నాను మీ ఫోన్ నెంబరు చిరునామా ఇస్తే చేతిలో డబ్బు రాగానే పంపిస్తామన్నారు. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లడం ఎలాగా అని ఆలోచించాడు రఘురాం. అమ్మకి కంటి ఆపరేషన్ ఈ నెల కాకపోతే వచ్చే నెల చేయించవచ్చు అనుకున్నాడు. ఇంటికి వచ్చినా నా కొడుకుని చూడగానే ఆప్యాయంగా పలకరించారు తల్లిదండ్రులు. అన్నయ్య నాకేం తెచ్చావ్ అంది చెల్లెలు. అన్నయ్య నాకు కాలేజీ ఫీజు కట్టాలి అన్నాడు తమ్ముడు. ఆయాసంతో తగ్గుతున్న తండ్రి మందులు అయిపోయినాయి తీసుకురావాలి అన్నాడు. నువ్వు వస్తావని కంటి ఆపరేషన్ చేయిస్తామని ఎదురు చూస్తున్నాను అన్నది తల్లి. వీళ్లందరి కోరికలు విన్నాక ఏం చేయాలి అర్థం కాలేదు రఘురామ్ కి. ఈనెల జీతం ఖర్చు అయిపోయింది వచ్చే నెలలో మీ అందరి అవసరాలు తీరుస్తాను అన్నాడు. అదేమిటి ఈనెల జీతం ఏం చేశావు అన్నారు. జరిగిందంతా వివరించాడు రఘురాం. ఇంట్లో ఇంతమంది అవసరాలు పెట్టుకొని ఆ పరంధామయ్య కాపాడటానికి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టావా. ఎవరికీ పట్టనిది నీకెందుకు. నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అన్నారు బాధ గా. మన అవసరాలు అంతా ముఖ్యమైనవి కావు ఈ నెల కాకపోతే వచ్చే నెల చూసుకోవచ్చు. ఒక నిండు ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకోవడం ధర్మమా. మన అవసరాలు కన్నా ఆయన ప్రాణాలు ముఖ్యం డబ్బు ఇవాళ కాకపోతే రేపు అయినా వస్తుంది ప్రాణం పోతే రాదు కదా మీరు ఒకసారి ఆలోచించండి అన్నాడు ఆవేదనగా. కొన్ని నిమిషాల తరువాత కొడుకు చేసిన పని మంచిదే అనిపించింది తమ అవసరాలు ఈ నెల కాకపోతే వచ్చేనెల చూసుకోవచ్చు పోయే ప్రాణం రేపటి దాకా నిలబడలేదు కదా ‌ పోనీలే రఘురాం మంచి పని చేశావు ఏదో బాధ లో అలా అన్నాను. ఏమి బాధ పడకు నువ్వు అన్నట్లుగానే వచ్చేనెల కంటి ఆపరేషన్ చేయించవచ్చు అన్నది తల్లి. నెల రోజుల తర్వాత పరంధామం కోలుకున్నాడు నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేము మీ డబ్బులు పంపిస్తున్నాను అంటూ ఏం చేశారు. డబ్బు కన్నా మానవత్వం గొప్పదని పించింది.
కామెంట్‌లు