వీధి నాటకం:-- ప్రతాప్ కౌటిళ్యా ((కె ప్రతాప్ రెడ్డి))
 మనుషుల్ని మట్టిలో నాటితే అస్థిపంజరాల చెట్లు
 మొలుస్తున్న వి
 సముద్రపు నీటిలో సూర్యుల్లను దాచి పెడితే వేడెక్కిన ఆకాశాన్ని   బొగ్గు గనులు గా మార్చి
త్రవ్వుతున్న నెలవంకల  కళ్ళకింద దరిద్ర రేఖలు హస్త  సాముద్రిక శాస్త్రం లిఖిస్తున్నవీ !? 
 పాదాల కింద భూమి దాచిపెట్టిన ధన రేఖలు
 భూమధ్య రేఖల నిండా 
 మంచు గడ్డలను కరిగిస్తున్న వి !?

  వేలాడుతున్న మనుషుల్ని కొయ్య గుర్రాలపై ఆటాడిస్తూ 
 పాలు మరువని పసి పాపలకు కీలు గుర్రాల కళ్ళెంఅందించి
 ఆనందిస్తున్న మధ్యాహ్నం ఒక ఉదయాన్నే ఉరితీయబడ్డ ది !?
 పాపం అనాథగా మారిన కిరణం
 ఆకురాల్చే కాలం ఒకటి ఆగి అగ్గిపుల్ల గీసింది
 తగలబడి పోతున్న రాత్రి స్వప్నం
 పొద్దున్నే ఒక ముద్దసద్దన్నం కోసం 
 వేల సంవత్సరాలు పెరిగినట్లు చీకటి లో 
కోటి ముక్కలై విసిరి వేయబడ్డ ది!?

 అది పారుతున్న  ఒక చీకటి నది వేయి తలలతో 
లెక్కలేని తోకల్ని మొలిపించీ  తిరగబడుతుంది!?
 వెలుగు ఒకటిఎదురుపడితే మింగేసింది

 విరగబడి  పూస్తూన్న అస్థిపంజరాల పూలదండ లను  ధరించడానికి
 దేవుడు ఎవడు ఇంకా పుట్టలేదు!?
 మనిషి పద్మవ్యూహం లాంటి ఆ పూలను దాటి 
  లోయలోకి దూకి ప్రాణాల్ని కాపాడుకున్నాడు
 వెనక్కి వెళితే అంతా అంధకారమే అంతా అందవి కారమే
 సౌందర్యం అంతా ముందుంది !?

 ఏడు సముద్రాలనీది  గడ్డ కు చేరిన గజ ఈతగాడకి
 గంధం పూసి తిలకం దిద్ది హారతి ఇచ్చిన ఆ చేతులు ఏం చెప్తున్నాయి!?
 రంగుల్ని తాగి లక్ష చిత్రాలను గీసినట్లు
 విషం తాగి ఒక్క నిమిషం బతకలేని మనిషి
 లక్షల సార్లు మరణిస్తూ ఒక బొమ్మను ప్రేమిస్తున్నాడు!?

 సంతోషపు మాంసపు ముద్దలు రెండు
 ఇంద్రధనస్సు కువ్రేలాడుతున్నాయి 
 వేల కళ్ళు పోటీపడి దక్కించుకున్న అదృష్టం 
రెండు చేతుల్లో అందుకునే సరికి ఆకాశం మాయమయింది !?

 మేఘం ఒకటి
   తేనెటీగ శరీర మై వానైకురిసింది
 మరుసటి రోజుకు మరోసారి  
మల్లెపూల వానై కురవడానికి సిద్ధంగా ఉంది!?

 అంతలోనే పగటి కడుపులో మాంసపు ముద్ధై మూలిగింది
 ఇంకేముంది మిగిలింది అంతా ఒకటే
 ఏడు రంగులు ఏవి
 వీధి నాటకాన్ని మనమే ఆవిష్కరించుకున్నట్లు
 ఈ వీధి నాటకం కూడా ముగిసింది!?

           Pratapkoutilya
        ..  lecturer in Bio-Chem
           8309529274

కామెంట్‌లు