కం: శ్రీవాణి కరుణ చేతను
భావా మృతరసమునొలుక బాగుగ రచనల్
గావించితిజను నీళ్ళులు పొగడ
సేవకుడను ఋషులకెల్ల చేసెద స్తుతియున్
కం: శిల్పిని గానును నేనిక
యల్పుడ యజ్ఞా పరుడను యందరి లోనన్
కల్పన దైవాలీలయు
సల్పితి కావ్యాలు పెక్కు సరసులు మెచ్చన్
కం: వింటిని గురువుప దేశము
కంటిని కనులార హరిని కడతేరితినీ
యంటిని మంత్రము మరవక
వుంటిని పిచ్చోని విధము వుర్విన గనగన్
కం: జ్ఞానులు పిచ్చిగ నగుపడు
పూనియు యజ్ఞానమాయ పూర్తిగ విడగన్
ధ్యానము జేయగ భక్తుడు
మును జన్మలులేక పరమ మోక్షము పొందున్
పూల బాట గురువు(కందపద్యాలం):-సామలేటి లింగమూర్తిసర్వక్రియ త్రీభాష కవి శతాధికగ్రంథకర్త సిద్దిపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి