దీపం-సరళ గున్నాల. ప్రథమశ్రేణి భాషోపాధ్యానిజి.ప.ఉ.పా మల్కాపూర్మం.కొండాపూర్జి.సంగారెడ్డి
అజ్ఞానముబాపుటకై
విజ్ఞానపువెల్గుబంచు నీదీపములే
సుజ్ఞానిగనినుమలచగ 
ప్రజ్ఞనుపెంపారజేయు ప్రజ్వలితంబై

చీకటి దూరముజేయు, వి
వేకమునింపగ గెలుపుల వెల్గులుబంచున్
ఏకముజేయగదేవుని
మీకిటనందించెదివ్వె మిమ్ములగాచన్

పానముకాధారమయ్యి
దానినినిల్పంగనిదియె దారంబగుచున్
కానగదేవునిరూపము
మానికమౌభక్తినింపు మహిమాన్వితమున్

గొలుసులచెమ్మెలయందున
తలపింపగభక్తి చమురు తాదాత్మ్యమ్మున్
ఒలికించగ,నాయువతే
తొలిదీపపుకాంతినింపె దొలగగనిడుముల్
అజ్ఞానముబాపుటకై
విజ్ఞానపువెల్గుబంచు నీదీపములే
సుజ్ఞానిగనినుమలచగ 
ప్రజ్ఞనుపెంపారజేయు ప్రజ్వలితంబై

చీకటి దూరముజేయు, వి
వేకమునింపగ గెలుపుల వెల్గులుబంచున్
ఏకముజేయగదేవుని
మీకిటనందించెదివ్వె మిమ్ములగాచన్

పానముకాధారమయ్యి
దానినినిల్పంగనిదియె దారంబగుచున్
కానగదేవునిరూపము
మానికమౌభక్తినింపు మహిమాన్వితమున్

గొలుసులచెమ్మెలయందున
తలపింపగభక్తి చమురు తాదాత్మ్యమ్మున్
ఒలికించగ,నాయువతే
తొలిదీపపుకాంతినింపె దొలగగనిడుముల్


కామెంట్‌లు