జాతీయ స్థాయి పద్యరచన పోటీలు

 నమస్కారం
పద్యకోకిల డాక్టర్ వేముగంటి నరసింహాచార్యుల  జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయంప్రతిపత్తి తెలుగువిభాగం వారు డిగ్రీ స్థాయి విద్యార్థులకు పద్యరచన పోటీలు నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాలలో ఏదేని డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు.
 పోటీలో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశం మీద నచ్చిన ఛందస్సులో తాము రాసిన పద్యాలను(రెండు నుండి  అయిదు పద్యాల వరకు) తేదీ 12 జూలై 2021లోగా క్రింద సూచించబడిన ఫోన్ నెంబర్లకు వాట్సప్ చేయగలరు.
పోటీలో గెలుపొందిన విద్యార్థులకు తేదీ 14 జూలై 2021 రోజున నిర్వహించే "శ్రీ వేముగంటి నరసింహాచార్యులు-జీవితం సాహిత్యం" వెబినార్ కార్యక్రమంలో   నగదుబహుమతి మరియు అందజేయబడుతుంది.
పంపవలసిన వివరాలు 
1.పద్యాలు
2. విద్యార్థి పేరు 
3.హాల్ టికెట్ నెంబర్
4. కళాశాల చిరునామా
5. ఫోన్ నెంబర్
పద్య రచనలు పంపవలసిన  వాట్సాప్ ఫోన్ నెంబర్లు
9666085015
9502585333
ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఇ-సర్టిఫికేట్ అందజేయబడుతుంది.
తెలుగువిభాగం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయంప్రతిపత్తి
సిద్ధిపేట
కామెంట్‌లు