నిజ నీరజ నవ్య నక్షత్ర
నవీన నుడికార నన్నయ నృపాధిక భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
2)విజయ వినయ వినూత్న విజ్ఞాన
వేద వినుత విద్య వైద్య
విశాల విశ్వంబులో విశేష విశ్వంభర భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
3)లౌక్య లిఖిత్వ లక్ష్మి లీలల
లల్లి లిల్లి లాస్య లతల
లలిత లావణ్య లయల లిపి భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
4)నవ్య నూతన అనంత భావ
మాధుర్య కమనీయ సుందర మధుర
విశ్వ కీర్తి విఖ్యాత గావించిన భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
5)అమృత ఆమనీల ఇందు ఈ
ఉదయ ఊయల ఋ ఎఱుక
ఏకాక్షర ఐశ్వర్య ఒనమాల అంబ భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి