పద్యాలు ;-బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట

 *సీసమాలిక*
రామేశ్వరములోన లక్ష్యాలు ఛేదించ
జన్మనొందెకలాం జగతియందు
భరతావనికిరాష్ట్ర పతిగానుపనిజేసి
వన్నెల తెచ్చెను బాధ్యతగను
శాస్త్రవేత్తగయుండి శాస్త్రాలు బోధించి
శిక్షణయిచ్చెను శీఘ్రముగను
కలలనుకనగసా కారంబుజేయని
నినదంబుజేసెను నిక్కముగను
యువతకాదర్శంగ యున్నతిగనిలిచి
యాదర్శమాయెనె యందరికిని
మిస్సైలు మ్యాన్గాను మిన్నగభారత్ కు
పేరునుతెచ్చెను ప్రీతితోడ
*తేటగీతి*
దేశ ముద్దులబిడ్డగ  దీప్తిపొంది
అబ్దులుకలాముగారలు నందముగను
స్ఫూర్తిదాయకమయ్యెను పుడమిలోన
మెప్పుపొందియువర్థిల్లె మిన్నగాను

కామెంట్‌లు