మోహన వంశీ - బాల గేయం :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు జులై 29, 2021 • T. VEDANTA SURY వంశీ వంశీ మోహనవంశీ వేకువ పిలిచే రారా వంశీ !తూరుపు దిక్కున వెలుగే వచ్చే లేగలు గంతులు చూడర వంశీ పులుగులు కువకువలాడే మేతకు గింజలు వేయగా రారా వంశీ !చల్లలు చిలికే సవ్వడి సాగే వెన్నలు తిందువు రారా వంశీ!హృదయం పొంగే ఆర్తివి కృష్ణా మధురం వదనం హాయిగ వంశీ!రాగము లోనా రమ్యత నీవే యోగము నివ్వగా రారా వంశీ! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి