డాక్టర్ హెడ్గెవార్! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనందరికీ ఆర్.ఎస్.ఎస్. అనేపేరు సుపరిచితం.సంఘసేవ దేశరక్షణ లో ముందుకి దూకేది  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులే.మరి దీన్ని నెలకొల్పింది  డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గెవార్. నాగపూర్ లో1889తెలుగు సంవత్సర ఉగాది రోజు పుట్టాడు. ప్లేగురోగులకు సేవచేస్తూ ఆయన తల్లి తండ్రులు ఇద్దరు ఆ వ్యాధికే గురియై ఒకేరోజు చనిపోతే తట్టుకుని  దేశసేవకై అంకితం అయిన  దేశభక్తుడు.  ఎక్కడనుంచో వచ్చిన  బ్రిటిష్ వారు  మనపై అధికారం చెలాయించటం ఆయనకు బాధగా ఉండేది. ఎనిమిదేళ్ల పిల్లవానిగా తన ధైర్యం దేశభక్తి ని ఎలా చాటుకున్నాడో చూద్దామా?
విక్టోరియా మహారాణి వజ్రోత్సవాలు సందర్భంగా బడి  లో మిఠాయిలు పంచారు.అంతా తింటూ ఉంటే చిన్నారి హెడ్గెవార్ దాన్ని విసిరేసి"ఛీ ఛీ. !ఆవిదేశీరాణి వేడుకలు మనం
ఎందుకు జరుపుకోవాలి?సిగ్గుచేటని అరిచి సంచలనం సృష్టించిన  ధైర్యశాలి.1908లో వందేమాతరం అని గొంతెత్తి అరిచి  తోటిపిల్లల్లో దేశభక్తి జాగృతం చేశాడు.  రాజద్రోహం అని స్కూల్ నించి బహిష్కరించారు.  పూనాలో మెట్రిక్యులేషన్ పాసై కలకత్తా లో వైద్య విద్యను అభ్యసించాడు. 1916లో డాక్టర్ గా డబ్బు కోసంకాక దేశభక్తి  స్వరాజ్య ఉద్యమం నడపటంకోసం నాగపూర్ లో క్లినిక్ తెరచాడు. ఎన్నో సార్లు జైలు పాలయ్యాడు. నిస్వార్థంగా దేశం కోసం ప్రాణాలు అర్పించే  కార్యకర్త లను తీర్చిదిద్దే  ఆర్.ఎస్. ఎస్.ని నెలకొల్పి యువతలో చైతన్యం తెచ్చారు. 1940లో ఆయన అమరుడైనా  ఆయన వెలిగించిన జ్యోతి ఇంకా దేదీప్యమానంగా వెలుగుతోంది కాబట్టే మనం భారత పుత్రులు గా తలెత్తి  తిరుగుతూ ఉన్నాము.శౌర్యానికి ప్రతీకగా కాషాయరంగు జెండా  రెపరెపలాడుతోంది.
ఆటపాటలు  యోగాసనాలు క్రమశిక్షణ  మహాపురుషుల జీవిత బాటలో నడిచేలా క్రమశిక్షణ  నేర్పుతారు. భారత దేశం సేవచేసేందుకై అవసరమైన  శక్తి శీలం జ్ఞానం  ఇవ్వమని రోజూ దైవప్రార్థన చేస్తారు. వెనకబడిన బస్తీలో పిల్లలకి చదువు ఆరోగ్యం శుభ్రత చిన్న కథల ద్వారా  నేర్పుతారు. వాటిని సేవాబస్తీలు అంటారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దేశంలో  ఏప్రాంతంలో భూకంపాలు వరదలు వచ్చినా విరాళాలు  దుస్తులు మొదలైనవి సేకరించి ఆదుకుంటారు.సేవాభారతి వనవాసీ కల్యాణాశ్రమం  విశ్వహిందూపరిషత్ విద్యాభారతి లాంటి సంస్థలు  నిరంతరం శ్రమిస్తున్నాయి.కుల ప్రసక్తి లేకుండా  వైదిక పూజ  అర్చన లో శిక్షణ ఇస్తారు. యోగా శిక్షణ  హిందూధర్మ పరిరక్షణ  సంస్కృతభాష ప్రచారం తోపాటు  ఆపదలో ఉన్న అన్ని జాతులు కులాలు మతాలవారిని ఆదుకుంటారు. సౌదీఅరేబియా పత్రిక  ఇలా ప్ర శంసించింది"ఆర్.ఎస్. ఎస్.  మహమ్మదీయులకు విరోధి కాదు "గుజరాత్ మోర్వీ ఆనకట్టకు గండిపడింది. రంజాన్ రోజుల్లో వారి సేవలు అందుకున్న  మహమ్మదీయులు అప్పుటి ప్రధాని శ్రీ వాజ్ పాయ్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్గిల్ యుద్ధం జరుగుతున్నటైంలో దేశసరిహద్దుల్లో  స్వయంసేవకుల సేవ  భద్రత అప్రమత్తత  చిరస్మరణీయం!శ్రీ నగర్ విమానాశ్రయంలో  మంచుగడ్డలను తొలగించారు.
నిశబ్దం గా  వీరు   మనకోసం  త్యాగం  చేస్తున్నారు. కరోనాకాలంలో కూడా  ఆదుకున్న ఈసంస్థ  ని గూర్చి ఇంకా  తెలుసు కోవాలి.