నాలానే నేనుంటాను:- సునీత ప్రతాప్
 పిచ్చుకలా కిచకిచా రావాలు చేయాలని వుంది 
 కానీ  అలా చేయలేకపోతున్నాను

 కోయిలలా  గళమెత్తి పాడాలని వుంది
 కానీ   అలా  పాడలేక పోతున్నాను

 నెమలిలా నాట్యమాడాలని వుంది
 కానీ   అలా నాట్యమాడ లేక పోతున్నాను

 కోడిపుంజులా అందరినీ  మేల్కొల్పాలని వుంది
 కానీ  అలా అలారం కాలేకపోతున్నాను

 అన్నింటా నేనిలా వాటిలా ఉండలేకపోతున్నాను
 అందుకే అందరితో  పోలికేల


 మనలా మనం ఉంటేనే కదా ప్రశాంతతా
 అందుకే  నేనంటాను

 నాకు  నేనే  సాటి  అని
 నాలానే  నేను ఉంటానని

          .     sunithaprathap
                     teacher palem
కామెంట్‌లు