రామయ్యకు దారిలో ఒక రాయి కనిపించింది. దేనికైనా పనికి వస్తుందిలే అనుకున్నాడు. వెంటనే దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకున్నాడు. మొదట బాగానే వుంది. కానీ కొంత దూరం వెళ్ళాక బరువు అనిపించింది. ఇంకొంత దూరం పోయాక ఇంకా బరువు అనిపించింది. మరికొంత దూరం వెళ్ళేక మోయలేనంత బరువు అనిపించింది. నడవటానికి ఆపసోపాలు పడ్డాడు. ఇక మోయలేక దాన్ని అక్కడే పడేసాడు. అమ్మాయ్యా అని ఊపిరి పీల్చు కున్నాడు. ఇంత దూరం మోసింది వృధా అయింది కదా అని బాధ పడ్డాడు.
మనకు కలిగే చిన్న చిన్న కష్టాలు కూడా ఇలాగే ఉంటాయి. మొదట బరువు అనిపించవు. అదేపనిగా అలోచిస్తే చింతగా మారతాయి. ఇంకా ఆలోచిస్తే వ్యాకులత అవుతాయి. ఇంకాఇంకా ఆలోచిస్తే పిచ్చి అవుతుంది. కాబట్టి ప్రారంభంలో అన్ని చిన్నగానే ఉంటాయి. అదేపనిగా మోస్తూవుంటేనే మనసు బరువెక్కుతుంది. వెర్రివాళ్ళం అవుతాము. పనికిరాని ఆలోచనలను ఆదిలోనే తుంచివేయాలి అని ఈ కథలో నీతి. మనిషికి కష్టాలు సహజం. వాటిని బరువుగా భావించకూడదు. వాటిని వెంటనే మరిచిపోవాలి. భూతద్దంలో చూసినప్పుడే సమస్యలుగా మారతాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి