వైద్యులు ,వైద్య సిబ్బంది కి అభినందనలు ::-డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్

 రోజురోజుకీ కరోనా  కేసుల సంఖ్య తగ్గిపోతున్న విషయం అందరికీ తెలిసిందే... గత కొన్ని నెలలుగా వైద్య, పోలీసు , ప్రభుత్వ ఇతర యంత్రాంగాలు కరోనా నిర్మూలన గురించి అహర్నిశలు  కృషి చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలంతా ధైర్యంగా కరోనా ని ఎదుర్కొనే శక్తి తో పాటుగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, మాస్కులు ధరించడం, స్వీయ  నియంత్రణే ప్రధానం గా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది. 
      ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ బెనెవోలెంట్  రీసెర్చ్ ఫౌండేషన్ IBRF సభ్యులు, ప్రముఖ  రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ  వైద్యులు ,వైద్య సిబ్బంది ప్రధానంగా కరోనా బాధితులకు సేవలందించి ఎందరో మంది ప్రాణాలను కాపాడారని  ఆ సమయంలో వారి ప్రాణాలను కూడా కొంతమంది కోల్పోయారని, కాబట్టి ఇక ముందు ఎటువంటి వేవ్ వస్తుందో రాదో విషయాన్ని మనం పక్కనపెడితే ముందుగా అందరూ ఆరోగ్య ( కరోనా నివారణ సంబంధిత )  నియమాలు పాటిస్తూ  అవసరం మేరకు మాత్రమే  బయటకి వస్తూ మనందరం ఆరోగ్యంగా ఉందాం.అని చెపుతూ  కరోనా  కష్టకాలంలో  తమ ప్రాణాలను లెక్కచేయకుండా  సేవలందించిన, అందిస్తున్న  ప్రభుత్వ యంత్రాంగం వారికి వారి సేవానిరతికి  ప్రతి పౌరుడు కూడా రుణపడి ఉంటాడని, తన ప్రత్యేక ధన్యవాదములు  అని ఒక ప్రకటనలో తెలియజేశారు.