సీసమాలిక
రాత్రి పగలనక రక్షణ జేయుచు
సరిహద్దు సైనికుల్ చక్కగాను,
తల్లిదండ్రినివీడితనవారినొదిలియు
భార్య పిల్లలబాసిబాధ్యతగను,
దేశ రక్ష కొరకుదేహమొదిలెదాక
పోరు సల్పెదవీవుపుత్రునిగను,
కంటి కునుకు లేక కాపలా కాయు చున్
భారత ప్రజలకు భాగ్య మొసగి,
మంచుకొండల్లోన మసలేవు, వణుకును
మదిలోకి రానీక మట్టుపెట్ట,
శత్రుసైన్యము పైన శరవేగమున జేయు
పోరులో వీరులై, పుడమితల్లి,
ఋణముదీర్చుటకునైరుధిర
మ్ముచిందించి
నసువులుబాసిన
యమరులార ! ,
త్యాగము కీర్తించతగవు యేవి యు సరి
మాటలు లేవిక మాన్యులార ! .
ప్రజల బ్రతుకు భరోసాకు పాటు బడియు,
కాపు గాచికదనమందు కాలు దువ్వి,
శత్రు సైన్యాన్ని యోడించె శౌర్య పుత్ర,
నమరవీరులందరికి నే యంజలిడుదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి